Palle Silaka Telugu Folk Song Lyrics,పల్లె సిలక తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్

Palle Silaka Telugu Folk Song Lyrics పల్లె సిలక తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్ –


Palle Silaka (పల్లె సిలక) Telugu Folk Song Lyrics


Song Details:

Song: Palle Silaka
Lyrics: Charan Arjun
Music: Malya Kandukuri
Singers: Vani Vollala, Vharan Arjun
Music Label: GMC Televission


Palle Silaka Telugu Folk Song Lyrics పల్లె సిలక తెలుగు ఫోక్ సాంగ్ లిరిక్స్

Palle Silaka (పల్లె సిలక) Melody Verses In Telugu – People Tune Telugu society tune Palle silaka verses in Telugu and English. This tune is delivered by the GMC Televission station. Palle silaka tune verses are composed by the Charan Arjun. Music given by the Malya Kandukuri and this tune is sung by the artists Vani Vollala, Vharan Arjun. http://lyricspage.in/

Palle Silaka Song Lyrics In Telugu:

తెల తెలవరంగా తెల్లవారంగ

తెల తెలవరంగా తెల్లవారంగ

ఈత ఆకు పొరకతో వాకిలిఉకి

ఈత ఆకు పొరకతో వాకిలిఉకి

తెల్ల ఆవు పేడతో కళ్ళాపి జల్లి

తెల్ల ఆవు పేడతో కళ్ళాపి జల్లి

పన్నెడు చుక్కల ముగ్గులు వేసి

పన్నెడు చుక్కల ముగ్గులు వేసి

బాసన్లు తోమి బట్టలు ఉతికి

మిద్ద మీద ఆరేసి

కుంకుడుకాయ సున్ని పిండితో తలంటు స్నానము పోసి

తులసి చెట్టు చుట్టూ తిరిగే తురుపు చుక్కా

రెండుకళ్ల సంబురమేలే ఈ పల్లె సిలక

చాటలోనా బియ్యం జరిగే సాయవ్వలెక్కా

ఊరూరూ గొట్టం ఊదే బువ్వే ఉడక

ఉట్టిమీద తమ్ముని కోసం ఉంచింది కమ్మని చేపల కూర

సద్ది కట్టి సైకిల్ మీద చేనుకెళ్లే అయ్యా ఆకలి తీరా

అలసిపోయిన అమ్మ ఉకించి పాదులు తీయంగా పట్టింది పారా

అమ్మనైనా కళ్ళముందే పరుగున వస్తుంది తన ఇల్లు చెరా

ఎర్ర మను తెచ్చి ఇల్లంతా అలికి

ఎండు పుల్లలు తెచ్చి పోయి చుట్టు పరిచి

మలి సంధ్య ఎలలో మళ్ళి ఇల్లుఉకి

అమ్మ వచ్చే ఏలకు పనులన్నీ చేసి

ఇరుగుపొరుగుతోని అరుగుల పైన

అచ్చట ముచ్చట ఆడేటి జాన

సీతమ్మతల్లోలే ఈ పల్లెలోన

రామయ్య కోసమే కలలు కన్ననా

దీపాలు పెట్టి దుపాయాలు వేసి కుల దేవుళ్ళని కొలిచి

కన్నీటి గంగై ఉప్పొంగుతుంది

తాత అవ్వాలను తలిచి

వాన వట్టి వెలిసిన తీరుగ మెరిసే గువ్వా

సూర్యరశ్మి సూటిగా తాకి పూసిన పువ్వా

అరవై ఐదు కేజీలు తూగే బంగారు మువ్వా

అచ్చమైన గ్రామీణ సొగసుకు అద్దం నువ్వా

కన్నతండ్రి కష్టాలు కన్నీళ్లు వింటుది ఓపిగ్గా ఇంకో తల్లై

మనసునల్లా మబ్బుల్ని కరిగించి మలి వెలుగునిస్తుంది ఆ జాబిల్లై

తల్లి పేద పెదువుల్లా పూస్తుంది చిరునవ్వు పువ్వుల్ని తేనెల పుతై

కళ్ళ ముందు కల్లోలమైతే చెలరేగిపోతుంది కాళీ మాతై

పచ్చని ఆకుల్ని మేకలకేసి గోదులు వేళలో గేదెలను చూసి

బిందాల్లో అందంగా పాలను పిండి

అందరికి పోస్తుంది తానుదగ్గరుండి

చిన్ననాటి దోస్తాని చిన్నారి చెప్పే

దునియాల ముచ్చట్లు సరదాగా వింటూ

వంటింట్లో అమ్మకు సాయపడ్తాది

పనితీరితే టీవీ ముందరుంటాది

పద్దెనిమిదేళ్ల పద్దుపొడుపంతా ముద్దులయే పల్లె సిలక

స్వచ్చంగా భూమిని చీల్చుకొని వచ్చే వాచనైనా ఈ మొలక

ఇంటిగడప తోరణమై వెలిగి పోయే మగువా

ఇంతకన్నా ఇంకేమి చెప్పను నీకున్న విలువ

లోకమంతా వెనుకాల నడిచే వేకువ తోవ

మానవాళి మన్నున పూసే వెన్నెల కాలువ

 

 

Palle Silaka (పల్లె సిలక) Telugu Folk Song Lyrics Watch Video

Leave a Comment